వైసీపీకి షాక్ : పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన బీజేపీ… !

-

రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో… ఏపీ రాజకీయాలు వేడేక్కాయి. ఒకరిపై మరోకరు మాటలు దాడులు కూడా చేసుకుంటున్నారు. ఈ తరుణం లో ఈ వ్యవహరంపై బీజేపీ పార్టీ తరఫున జీవీఎల్‌ నరసింహ స్పందించారు. ఈ వివాదంలో వైసీపీ చురకలు అంటిస్తూ… పవన్‌ కు మద్దతు పలికారు.

జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ గారి పై వైసీపీ నాయకుల దుర్భాషలను ఖండిస్తున్నానని స్పష్టం చేశారు జివిఎల్ నరసింహ. విమర్శ తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలని చురకలు అంటించారు. “నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం. తిట్ల తుఫానుకు తెరదించి గులాబ్ తుఫానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలి.” అంటూ ఫైర్‌ అయ్యారు జివిఎల్ నరసింహ. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ఇక జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ కు బీజేపీ మద్దతు ప్రకటించడం పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version