15 ఏళ్ళుగా కత్తిరించని జుట్టు…ఆ ఒక్క కారణంతో కత్తిరించాడు..!!!

-

చాలామందికి గోళ్ళు పెంచడం ఇష్టం, వాటిని కత్తిరించకుండా, ఎంతో అందంగా తీర్చి దిద్దడానికి ప్రయత్నిస్తారు. అలాగే కొంతమంది  స్టైల్ గా ఉండటానికి ఎంతో ఆరాటపడుతారు. ఈ క్రమంలోనే వారు రకరకాలుగా తమలో మార్పులు చేసుకుంటారు. వారి పద్దతులు మర్చుకోమంటే మాత్రం ముక్కు మీద కోపం వస్తుంది. అన్నం తినడం అయినా మానేస్తారేమో కాని వారి వారి పద్దతులలో మార్పు మాత్రం చేయరు. కానీ అమెరికాలో ఓ వ్యక్తి మాత్రం ఒకే ఒక్క కారణంతో 15 ఏళ్ళుగా ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న జుట్టుని కత్తిరించేశాడు. కేవలం ఒకే ఒక్క కారణం…

అమెరికాకి చెందినా రెనాల్డో అనే 23 ఏళ్ళ యువకుడుకి తన జుట్టు అంటే చిన్నతనం నుంచీ ఎంతో ఇష్టం. అందుకే దాదాపు 15 ఏళ్ళుగా జుట్టు కత్తించకుండా పెంచుతున్నాడు. అతడి జుట్టు చూస్తె అమ్మాయిలు వేసుకునే జడలా బారుగా ఉంటుంది. రోజు చూసుకుని మురిసిపోయే వాడు. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా వినలేదు. ఈ క్రమంలోనే ఆర్మీలో చేరాలని కలలు కన్నా రెనాల్డో దరఖాస్తు పెట్టుకున్నాడు.

ఆర్మీ అధికారులు ఎంపిక చేసిన పేర్లలో రెనాల్డో పేరుకూడా ఉండటంతో ఎగిరి గంతేశాడు. కానీ ఆర్మీలో చేరాలంటే జుట్టు తెలగించాలి, లేదంటే అధికారులు ఒప్పుకోరు. ఈ సమయంలో అతడు ఎంతో ఒత్తిడికి గురయ్యాడు. ఎంతో ఇష్టపడి 15 ఏళ్ళుగా పెంచుకున్న జుట్టు, మరో పక్క దేశ సేవ చేసే అవకాశం ఏది ముఖ్యం అనుకున్నాడు. వెంటనే జుత్తు కత్తిరించుకున్నాడు. అంతేకాదు తన జుట్టు లాక్స్ ఆఫ్ లవ్ అనే స్వచ్చంద సంస్థకి అందించాడు. ఈ సంస్థ కేన్సర్ భాదితులకి విగ్గులని అందిస్తుందని నా జుట్టు పది మందికి ఇలా ఉపయోగపడటం సంతోషంగా ఉందని రెనాల్డో పేర్కొన్నాడు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version