తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సగం సగం రుణమాఫీ వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ప్రసంగించారు.రాష్ట్రంలో సగం మంది రైతులకు రుణమాఫీ కాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ అయ్యిందని చెబుతోందని గుర్తుచేశారు.
దీనివల్ల బ్యాంకులు అందరినీ పరిగణనలోకి తీసుకొని వన్ టైం సెటిల్మెంట్ కింద రుణాలను రద్దు చేస్తుంది.ఆ తర్వాత కొత్తవి తీసుకోవడానికి రైతులకు అర్హత ఉండదు. దీంతో రైతులు అటూ ఇటూ కాకుండా, తీవ్రంగా నష్టపోతున్నారని ఆమె ప్రకటించారు.కాగా, ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్వీట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.