దేశ రాజకీయాల్లో కీలకం కావాలని పరితపిస్తున్నారు కేసీఆర్.ఇందులో భాగంగానే తన సత్తా చాటేందుకు కొత్త పార్టీ ఒకటి జాతీయ స్థాయిలో ఆరంభించాలని చూస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవహారాలు ఇకపై హరీశ్ మరియు కేటీఆర్ చూడనున్నారు. కేసీఆర్ మాత్రం ఢిల్లీ గల్లీలలో పాలిటిక్స్ చేయనున్నారు.ఇప్పటికే ఇందుకు సంబంధించి కొన్ని ప్రాథమిక చర్చలు జరిగేయి. తన పాత మిత్రుడు, తెలుగుదేశఃం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబుకు దూరంగా ఉంటూనే కొంత రాజకీయం నడపాలని కూడా అనుకుంటున్నారు కేసీఆర్.ఇదే సమయంలో జగన్ తోనూ, అవసరం అయితే స్టాలిన్ తోనూ ఇంకా వీలుంటే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తోనూ రాజకీయం సఖ్యతతో కూడిన విధంగానే నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక మోడీ హవాకు కేసీఆర్ చెక్ పెట్టడం అన్నది జరగని పని ఎందుకంటే ఆయనకు ఉన్న ఇమేజ్ దగ్గర కేసీఆర్ పెద్దగా రాణించలేరు.గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసి సఫలీకృతం కాక వెనక్కుతగ్గారు. తరువాత దేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవహారాలు చూసేందుకు సీనియర్ పొలిటీషియన్ కే కేశవరావుకు ఆ బాధ్యతలు అప్పగించి కేసీఆర్ తప్పుకున్నారు.2014 -19లో కవిత నేతృత్వంలో ఢిల్లీ రాజకీయాలు నడిచాయి కానీ అవేవీ వేగవంతంగా సాగలేదు.