తారక్‌కు అన్ని స్టోరిలు చెప్పిన ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి..

-

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్, స్వప్నదత్ ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ‘సీతారామం’. ఇటీవల విడుదలైన ఈ పిక్చర్ ను జనాలు విశేషంగా ఆదరిస్తు్న్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. సుమంత్, రష్మిక మందన కీలక పాత్రలు పోషించారు. కాగా, ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడి గత చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, ఈ ఫిల్మ్ మాత్రం అంచనాలను మించి ఉంది.

దర్శకుడు హను రాఘవపూడికి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాకు ముందే ఆయనకు తన చాలా సినిమాల స్టోరిలు చెప్పానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘లై’ ఫిల్మ్ స్టోరితో పాటు పలు స్టోరిలు చెప్పానని తెలిపారు. తారక్ మెహిదీపట్నంలోని ఇంట్లో ఉన్నపుడు తాను ఆయన వద్దకు వెళ్లి స్టోరిలు చెప్పానని గుర్తు చేసుకున్నాడు.

తన స్టోరిలు విని తారక్ ఓకే అన్నారని, కానీ, ఆయనకున్న స్టార్ ఇమేజ్ కు సరిపోయే స్టోరి తన వద్ద బహుశా ఇంకా రెడీ కాలేదని స్పష్టం చేశారు హను. నేచురల్ స్టార్ నాని కోసం తాను రాసుకున్న స్టోరి ఉందని, ఆయనతోనే అది తీయాలని హను వివరించారు. ఇకపోతే దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ లతో తను మరొక సినిమా చేయాలని, అశ్వనీదత్ బ్యానర్ లోనే ఆ పిక్చర్ ఉంటుందని అన్నారు హను.

హను రాఘవపూడి-తారక్ కాంబోలో సినిమా రావాలంటే అందుకు తగ్గ స్టోరి ఉండాలని హను తెలిపారు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వసిని మా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఆ ఫిల్మ్ ఉండబోతున్నది. RRR తర్వాత తారక్ చేస్తున్న ఈ పిక్చర్ పైన భారీ అంచనాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version