హనుమాన్ టీమ్ క్రియేటివ్ మైండ్ కు హ్యాట్సాఫ్..!!

-

యంగ్  హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ  తెరకెక్కిస్తోన్న మరో చిత్రం హను-మాన్. . ఇటీవల విడుదలైన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు పొంది  మంచి వ్యూస్ సాధించింది.ఇక ఈ సినిమా హీరో మరియు దర్శకుడు అచ్చం కార్తికేయ 2 సినిమా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.

ఆ సినిమా కృష్ణ దేవుని పై తీస్తే ఈ సినిమా ను హనుమంతుడి మీద తీశారు. అసలే ఉత్తర భారతదేశంలో విపరీత మైన భక్తి కలిగి ఉంటారు. వాస్తవానికి ప్రశాంత్ వర్మ కు కార్తికేయ 2 సినిమా తెచ్చిన వసూళ్ల ను చూసి నమ్మకంతో బడ్జెట్ ఎక్కువ పెట్టడానికి సాహసం చేశారు. అలాగే అంతకు ముందు అయోధ్య వంటి పాపులర్ గుళ్ల కు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు.ఇక ఈ సినిమా మీద నమ్మకంతో భారీ ఎత్తున మే నెలలో రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ గా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించారు. ఈ విశేషాల గురించి తెలుపుతూ తాజాగా విడుదలైన అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంటుంది. వరల్డ్ మ్యాప్‌ లో హనుమాన్ ముఖ చిత్రం, గధను చూపిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో సినిమా విడుదల అవబోతుందని క్రియేటివ్ గా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version