ఓటీటీలో వచ్చిన 11 గంటల్లోనే రికార్డు సృష్టించిన హను మాన్ మూవీ ..!

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. చాలా రోజుల క్రితమే ఓటీటీ లోకి రావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.

అయితే ఎట్టకేలకు ఆదివారంనుంచి తెలుగు వర్షన్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ 5 లో స్ట్రీమింగ్ మొదలైంది. హిందీ వర్షన్ శనివారం నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ మొదలయింది. ఈ చిత్రం ఓటిటిలో విడుదల అయ్యాక కాస్త నెగిటివిటి కూడా మూటగట్టుకుంది. అయితే ఆ నెగిటివిటి హను మాన్ మూవీ సంచలనాలని అడ్డుకోలేకపోతోంది. జీ 5 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓటిటిలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 11 గంటల్లోనే 102 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. అంతే కాదు ప్రస్తుతం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నట్లు కూడా జీ 5 సంస్థ ప్రకటించింది. ఈ సినిమాలో కథానాయికగా అమృతా అయ్యర్ నటించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version