MLC కవిత అరెస్ట్ పై ఈడీ సంచలన ప్రకటన..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  అధికారిక ప్రకటన చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి.. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని ఈడీ స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీన ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు ప్రకటించింది. సోదాల సందర్భంగా కవిత కుటుంబ సభ్యులు ఆటంకం కలిగించారని తెలిపింది. వంద కోట్ల ముడుపుల వ్యవహరంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని పేర్కొంది. ఆప్ నేతలతో కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని లీక్ చేసి.. అందుకు వారికి వంద కోట్లు చెల్లించారని వెల్లడించింది.


ఆప్ నేతలకు రూ. 100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవితది కీలక పాత్ర అని ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 240 చోట్ల సోదాలు చేసి.. 5 సప్లిమెంటరీ చార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. 128 కోట్ల ఆస్తులను గుర్తించి సీజ్ చేశామని పేర్కొంది. లిక్కర్ స్కామ్లో నిందితులైనా ఆప్ నేతలు మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, విజయనాయర్లతో కవితకు లింకులు ఉన్నాయని ఆరోపించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కవితను రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం ఈడీ అదుపులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version