సీఎం చిత్రపటానికి పాలాభిషేకం..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజాపాలనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వం మీద ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం చేసిన కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

బడ్జెట్ కేటాయింపుల్లో జిహెచ్ఎంసి అభివృద్ధి కోసం ఏకంగా 1152 కోట్ల నిధులు కేటాయించారు దీని పట్ల కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆనందం సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు 2024 25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సెక్షన్ సర్వేలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు జిహెచ్ఎంసి కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version