నందమూరి తారకరామారావు, బసవతారకం లకు సెప్టెంబర్ 2, 1956న నాలుగో సంతానంగా హరికృష్ణ నిమ్మకూరులో జన్మించారు. తన తండ్రి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సంద్భంలో తెలుగు దేశం పార్టీ ప్రభంజనంలో నాడు తండ్రికి తోడుగా చైతన్యరథాన్ని స్వయంగా నడుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కుమారుడికంటే కూడా రథసారథిగానే ఎక్కువ మందికి ఆయన దగ్గరయ్యారు. ముక్కుసూటి మనిషిగా ఏదీ దాపరికం లేకుండా మాట్లాడే తత్వం ఆయనది.
11 ఏళ్ల వయస్సులో 1967లో సీనిరంగ ప్రవేశం చేసిన ఆయన ‘శ్రీకృష్ణావతారం’ సినిమాతో తెరంగ్రేటం చేశారు. ఆ తర్వాత ఆయన నటించిన రామ్ రహీమ్, దాన వీర శూర కర్ణ .. తదితర సినిమాల్లో పౌరాణిక పాత్రలో ఆయన అలరించారు.
ఆతర్వాత 1998లో ‘శ్రీరాములయ్య సినిమాతో మరోసారి తన నటనను ప్రారంభించారు. ఈ క్రమంలో ‘సీతరామరాజు‘, లాహరి -లాహిరి, శివరామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణ మాసం ఇలా అనేక చిత్రాల్లో నటించారు. తెలుగు అంటే ఎంతో ప్రేమను కనబర్బే హరికృష్ణ పార్లమెంటులో నూ తన తెలుగు జాతి జౌనత్యాన్ని చాటడం కోసం తెలుగులో ప్రసంగించారు. తెలుగు ప్రజలు ఆయన్ను ఆంధ్రా టైగర్ గా పిలుచుకునేవారు. తెలుగు దేశం పార్టీలో కీలక వ్యక్తిగా ఆయన వ్యవహరించారు. పార్టీ ఎన్నికష్టాల్లో ఉన్నప్పటికీ తన తండ్రి స్థాపించి పార్టీ తెలుగు జాతీ ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పేవారు. ఈరోజు ఆంధ్రా టైగర్ రోడ్డ ప్రమాదంలో మరణించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
స్థాయితో సంబంధం లేని వ్యక్తి
ఎదుటి వారితో స్నేహం చేయాలంటే స్థాయి చూసుకుని స్నేహం చేసే ఈ రోజుల్లోనూ.. ఇతరుల స్థాయిలో సంబంధం లేకుండా లో ప్రొఫైల్ జీవితాన్ని గడపడం హరికృష్ణ కు అలవాటుు.. అభిమానులు, మిత్రులు ఏ కార్యక్రమానికి ఆహ్వానించిన సరే ఆయన తప్పక హాజరవుతుంటారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆయన అభిమాని మోహన్ కుమారుడి వివాహనికి వెళ్తు ఇలా ప్రమాదానికి గురవడం ఎంతో బాధాకరం..
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులకు ఆయనతో ఎనలేని సంబంధం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరికృష్ణకు అత్యంత ఆప్తుడు. నాడు తెలుగు దేశం పార్టీలో వీరిద్దరు కలిసి పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి…