నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యయి ప్రమాదం జరిగిన వెంటనే 10 నిమిషాల్లోనే సమీపంలోని నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
నెల్లూరులో జరగనున్న అభిమాని మోహన్ కుమారిడి వివాహం కోసం హైదరాబాద్ బుధవారం ఉదయం బయల్దేరిన నందమూరి హరికృష్ణ స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తూన్న సందర్భంలో ఒక్కసారిగా కుదుపుకులోనై కారు అదుపు తప్పడంతో ఎడమవైపు నుంచి కుడివైపుకు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లింది. ప్రమాద విషయం తెలిసిన హరికృష్ణ తనయులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హుటాహుటిన కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యలకు వరుస రోడ్డు ప్రమాదాలు వెంటాడుతుండటంతో కుంటుంబ కన్నీరు మున్నీరవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ తమ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకున్నారు.
నాలుగేళ్ల క్రితం హరికృష్ణ కుమారుడు జానకీరాం నల్గొండ – విజయవాడ జాతీయ రహదారిపై మరణించగా, అంతకు ముందు 2009లో ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న జూ.ఎన్టీఆర్ కి అదే రహదారిపై ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ కుటుంబ పెద్దకు ఇలా జరగడంపై కుటుంబ సభ్యులంత విలపిస్తున్నారు.