తెదేపా సీనియర్ నేత నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి పాడె మోశారు. పార్టీ శ్రేణులు, అభిమానుల అశ్రునయనాల మధ్య జోహర్ హరికృష్ణ అంటూ యాత్ర సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హరికృష్ణ కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ పట్టనేని దు:ఖంతో అంతిమయాత్రకు బయల్దేరారు. కొద్ది సేపట్లో హరికృష్ణ అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరుకోనుంది.