త్వరలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : హరీష్ రావు

-

అతి త్వరలోనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 60 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు గోదావరి నీటిని విడుదల చేశారు మంత్రి తన్నీరు హరీష్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాల తో తెలంగాణ ను అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు.

7 సంవత్సరాల లో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం లో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలిపారని.. కేంద్రం అనేక షరతులు, నిబంధనలు పెడుతూ.. ప్రాజెక్ట్ లకు నిధులు రాకుండా అడ్డు పడుతుందని వెల్లడించారు.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, REC నుంచి అప్పుగా నిధులు రాకుండా అడ్డు పడుతుందని.. అత్యుత్తమ ఆర్థిక విధానాల తో ఎడెండ్ల లో తెలంగాణ GSDP నీ రెట్టింపు చేశారని స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ ను నె o.1 గా నిలిపారని.. కేసిఆర్ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణ లేదని వెల్లడించారు. తెలంగాణ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు… రంగనాయక సాగర్ జలాశయం ఉండేది కాదని.. సిద్దిపేట ప్రాంతానికి సాగు జలాలు వచ్చేవి కావని మంత్రి హరీష్ రావు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version