‘కంటి వెలుగు’ గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాలి : హరీష్‌రావు

-

రాష్ట్రంలో వచ్చే నెల 18 నుంచి ప్రారంభించే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ. హరీష్ రావు అధికారులను కోరారు. రాష్ట్ర ప్రజల కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి హరీష్‌ రావు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ లతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరూ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు మంత్రి హరీష్‌ రావు.

ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా సీరియస్ గా తీసుకొని పని చేయాలన్నారు మంత్రి హరీష్‌ రావు. జిల్లాల్లో ప్రభావ వంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేసిందన్నారు మంత్రి హరీష్‌ రావు. పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం పై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version