కాంగ్రెస్ సర్కారు మీద మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా పాపన్నపేట లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం లో హరీష్ రావు మాట్లాడారు. వడ్ల మీద దృష్టి పెట్టమంటే వలసల మీద రేవంత్ రెడ్డి నజర్ పెట్టారని అన్నారు. ఈ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.
ఒకసారి మోసపోయామని మళ్లీ మోసపోవద్దని అన్నారు రుణమాఫీ చేయనీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని పిలుపునిచ్చారు. తమ నేతల ఇళ్లకు వెళ్లి ఎందుకు కలుస్తున్నారని ఫైర్ అయ్యారు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ జనాన్ని నట్టేట ముంచిందని అన్నారు.