మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వైసిపికి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఏపీసిసి వై ఎస్ షర్మిల కృపారాణి కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు జగన్ కోసం ఎంతో కష్టపడ్డారని ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టాలని అన్నారు.
పార్టీ శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడినా సీఎం జగన్ నన్ను పక్కన పెట్టారని తన కష్టానికి తగిన గుర్తింపు రాలేదని అన్నారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తనకి దేవుడని అన్నారు రాజశేఖర్ రెడ్డి ని ఇప్పుడు మళ్లీ షర్మిల లో చూస్తున్నానని ఆమె చెప్పారు. కాగా షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని భీమా వ్యక్తం చేశారు జగన్ ఒక నియంత అని ఈ నియంతని గద్దె దించాలని షర్మిలమ్మని ఎంపీగా గెలిపించుకోవాలని ఆమె కోరారు.