నా కార్ లో తీసుకువెళ్తా… గర్భిణికి హరీష్ రావు హామీ…!

-

వలస కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజు రోజుకి వారి కష్టాలు తీవ్రంగా మారుతున్నాయి. వేలాది మంది వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వారికి తెలంగాణా సర్కార్ అండగా నిలబడుతుంది. తాజాగా మధ్యప్రదేశ్ కి చెందిన ఒక మహిళకు హరీష్ రావు అండగా నిలబడ్డారు. తాను తన కారులో పంపిస్తా అన్నారు.

10 మంది కుటుంబీకులు కలిసి మెదక్ జిల్లా నారాయణఖేడ్ నుంచి రామయంపేట మీదుగా దాదాపు గత నాలుగు రోజులుగా కాలినడకన మధ్యప్రదేశ్‌కు వెళ్ళాలి అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు… సుస్మిత అనే గర్భిణీ ఉండడంతో ఆమెకు వైద్య చికిత్స అవసరమని భావించిన హరీష్.. అన్ని రకాలుగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే వారిని సిద్ధిపేట ఆస్పత్రికి తరలించారు.

సుస్మితను గురువారం హరీష్ పరామర్శించారు. ఆమె కన్నీరు పెట్టుకోవడం తో హరీష్ రావు వెంటనే స్పందించారు. కాలినడకన మధ్యప్రదేశ్‌కు వెళ్లడం మంచి కాదని, అందరికీ అన్నం పెట్టించడంతో పాటుగా లాక్ డౌన్ అయ్యే వరకు పని కల్పిస్తాం అన్నారు హరీష్. మే 7వ తేదీన లాక్ డౌన్ పూర్తయ్యాక తన ప్రత్యేక వాహనంలో అందరినీ మధ్యప్రదేశ్‌లోని స్వస్థలానికి పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇబ్బందులు ఉంటే చెప్పాలి అని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version