తెలంగాణ రైతులకు శుభవార్త..రుణమాఫీపై కీలక ప్రకటన

-

తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. వచ్చే బడ్జెట్‌ లోపు లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని కీలక ప్రకటన చేశారు మంత్రి హరీష్‌ రావు.ఆందోల్ నియోజకవర్గం, తాలెల్మా గ్రామ శివారులో శ్రీ రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో..హరీష్‌ రావు మాట్లాడారు. రేణుకా ఎల్లమ్మ ఎత్తి పోతల పథకంతో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ తీరనుంది. సింగూరు నీళ్లతో రేణుక ఎల్లమ్మ పాదాలు కడిగి చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నాము.మొత్తం 14 గ్రామాల్లో 3000 ఎకరాలకు సాగు నీటి కొరత తీరుతుందన్నారు.

సీఎం కేసీఆర్

సమీపంలోనే సింగూరు జలాశయం ఉన్నా, ఈ ప్రాంతాలు తడిచే పరిస్థితి లేదు. ఇక్కడి ప్రాంతాల రైతులకు చుక్క నీరు అందలేదు….రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం.. 2017-18 లో తాలెల్మా శివారులో రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 3 వేల ఎకరాలు, బీడు భూములకు నీరు అందించడం ద్వారా మరో 3, మొత్తం 6 వేల ఎకరాలకు నీరు అందుతుంది. కేంద్రంలోని బీజేపీ ఒక్క ప్రాజెక్ట్ కు సాయం చేయడం లేదు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకుంటోందని వెల్లడించారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు‌తెలంగాణ అభివృద్ధికి నిరోథకంగా తయారయ్యాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version