రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకలేకపోయిందని అన్నారు. ప్రసంగం చాలా పేలవంగా ఉండడంతోపాటు ప్రభుత్వం తన విజన్‌ను ఆవిష్కరించలేకపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హామీలు, గ్యారంటీల అమలుపై గవర్నర్ ప్రసంగం స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. ఆశగా ఎందుకు ప్రజలకు నిరాశ మిగిలించిందని విమర్శించారు.
“గవర్నర్ ప్రసంగమంతా శాసనసభను అవమానపర్చడం గవర్నర్ గౌరవాన్ని తగ్గించినట్లుగానే సాగింది. ప్రజావాణి తుస్సుమంది. ప్రతి రోజు విజ్ఞప్తులు స్వీకరిస్తామన్న సీఎం ఒక్క రోజు మాత్రమే వెళ్లారు. కొన్నాళ్లు మంత్రులు వెళ్లారు. కానీ తర్వాత వెళ్లలేదు. అధికారులు కూడా లేరు. పొరుగు సేవల సిబ్బంది మాత్రమే దరఖాస్తులు తీసుకుంటున్నారు. రెండు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశామని అర్ధసత్యాలు గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. పాక్షికంగా అమలు చేసి మొత్తం గ్యారంటీ అమలు చేసినట్లు చెప్పడం దురదృష్టకరం. ఆరోగ్యశ్రీ ప్రస్తావన లేదంటే దాని అమలు సరిగ్గా లేదని చెప్పకనే చెప్పారు.” హరీశ్ రావు విమర్శించారు.