ఆగస్టు లోనే కొత్త పింఛన్లు, రేషన్‌ కార్డులు మంజూరు

-

సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన అందరికీ ఆగస్టు లోనే కొత్త పింఛన్లు, రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటన చేశారు. నారాయణఖేడ్ రూపు రేఖలు పూర్తిగా మారాయి. పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి చొరవతో 100 కోట్ల పనులు జరుగుతున్నాయి. రూ. 25 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేసుకుంటున్నాం.. 800 డబుల్ బెడ్ రూం ఇల్లు దసరా వరకు పూర్తి చేసి అర్హులకు అందిస్తామని ప్రకటించారు.

మంచి విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చాము. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 గురుకులాలు తెచ్చాము…వంద పడకల ఆసుపత్రి పూర్తి అయ్యింది. మరో 50 పడకల ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. తల్లి, బిడ్డలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. సి-సెక్షన్లు తగ్గించేలా అందరం కృషి చేయాలి… బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలు ఉన్నాయా.!? అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ వాళ్లు మస్తు మాటలు చెబుతారు. 60ఏళ్లు పాలించి ఎందుకు చేయలేదు.

ప్రజలకు చేయలేదు. కానీ, వాళ్లకు వాళ్ళు చేసుకున్నరు…బిజేపి మాటలు వింటే ఆగం అవుతాం. కాంగ్రెస్ మాటలు వింటే మోసపోతామని మంత్రి హరీష్ రావు గారు అన్నారు. అనంతరం నారాయణఖేడ్ పట్టణంలో రూ. 25 కోట్లతో చేసే పలు అభివృద్ది పనులకు శంఖు స్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ భూపాల్ రెడ్డి గారు, కలెక్టర్ శరత్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version