రాజకీయాల్లో ప్రత్యర్ధులపై విమర్శలు చేయడం సహజమైన ప్రక్రియే..నిత్యం ప్రత్యర్ధులని టార్గెట్ చేసుకుని రాజకీయం చేయడం అనేది సాధారణమైన విషయమే..అయితే ఇక్కడ విమర్శలు అనేవి అర్ధవంతంగా ఉండాలి..విమర్శలు చేస్తే ప్రజలు నమ్మేలా ఉండాలి…అలాగే తమ వెనుక ఉన్న లొసుగులని కప్పేసుకుని ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తే ప్రజలు పట్టించుకునే పరిస్తితి ఉండదు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే పరిస్తితి కనిపిస్తుందని చెప్పొచ్చు…అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఎప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది…అయితే విమర్శలు సరిగ్గా ఉంటే ప్రజలు పట్టించుకుంటారు…లేదంటే విమర్శలని ప్రజలు నమ్మరు.
తాజాగా మంత్రి రోజా చేసిన విమర్శల పరిస్తితి కూడా అలాగే కనిపిస్తోంది…రాజకీయాల్లో రోజా ఫైర్ బ్రాండ్ నాయకురాలు అనే సంగతి అందరికీ తెలిసిందే…రోజా ఏ స్థాయిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడతారో తెలిసిందే…ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంటారు..అలాగే పవన్ కల్యాణ్ పై కూడా విరుచుకుపడుతుంటారు. ఇక ఇక్కడ రోజా చేసే విమర్శలు అర్ధమవంతంగా ఉంటే ఇబ్బంది లేదు…అలా కాకుండా ఏదో గుడ్డిగా విమర్శలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్తితి ఉండదు.
తాజాగా రోజా…పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు… పవన్ కళ్యాణ్ రీల్ హీరో మాత్రమే.. రియల్ హీరో కాదని, రెండున్నర గంటల సినిమాలో పవన్ కళ్యాణ్.. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కావొచ్చని.. కానీ, రియల్ లైఫ్‌లో మాత్రం ఆయన సీఎం అస్సలు కాలేరని, రియల్ లైఫ్ లో జగనే హీరో అని అన్నారు.
ఇక ఇక్కడ పవన్ సీఎం అవ్వగలరో లేదో జనం నిర్ణయిస్తారని, అలాగే జగన్ ని సీఎం పీఠంలోనే ఎల్లకాలం ఉండరని, అంత ఎందుకు నెక్స్ట్ రోజా ఎమ్మెల్యేగా గెలుస్తారా? అని చెప్పి జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. నెక్స్ట్ రోజా నగరిలో గెలిస్తే గొప్పే అని అంటున్నారు. ముందు తాను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో చూసుకోవాలని, పవన్ సంగతి ప్రజలు చూసుకుంటారని కౌంటర్ ఇస్తున్నారు. మరి చూడాలి నెక్స్ట్ నగరిలో రోజా గెలిచి హ్యాట్రిక్ కొడతారో లేదో?