“హత్య” మూవీ విజయ్ ఆంతోనీ కి బ్రేక్ ఇచ్చిందా ?

-

తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన హీరో, నిర్మాత, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన విజయ్ ఆంథోనీ ఫలితం తో ఎటువంటి సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. గతంలో బిచ్చగాడు సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందించిందో తెలిసిందే. ఆ తర్వాత దాదాపుగా ఒక పదికిపైగానే సినిమాలను చేసి ఉంటాడు విజయ్ ఆంథోనీ.. కానీ కాలం కలిసిరాక అన్నీ నిరాశను మిగిలిచాయి. ఈ మధ్యన బిచ్చగాడు కు సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2 కూడా విజయ్ కు అసంతృప్తిని మిగిల్చింది. ఇక తాజాగా మరో మర్డర్ మిస్టరీ తో నేడు థియేటర్ లలో విడుదల అయింది మరో సినిమా. ఇందులో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా విజయ్ ఆంథోనీ నటించాడు. కథ పాతదే అయినా ప్రెసెంట్ చేసే విధానంలో కొత్తగా చూపించాలి అనుకున్న డైరెక్టర్ శ్రమ ఫలించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఇందులో ప్రేక్షకులను థ్రిల్ చేసే విషయాలు ఎక్కువగా లేకపోయినా.. క్రైమ్ సీన్ లు మరియు ఇన్వెస్టిగేషన్ చేసే విధానం ఆకట్టుకుంటుందట. ఇక ఇందులో మైనస్ లు కన్నా కూడా ప్లస్ లు ఎక్కువగా ఉన్నాయి.. అందుకే ఇన్నాళ్లకు విజయ్ ఆంథోనీ హిట్ కొట్టాడని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version