“బ్రో” సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సాయి ధరమ్ తేజ్ … !

-

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఈ రోజు తనకు బాగా ఇష్టమైన దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయుణ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో విడుదల కానున్న బ్రో సినిమా గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సాయి తేజ్ మాట్లాడుతూ.. బ్రో సినిమాను నేను మా గురువు గారు పవన్ కళ్యాణ్ తో చేయడం జరిగింది… సినిమా చేస్తున్నంత కాలం చాలా హ్యాపీ గా అనిపించింది, పవన్ తో చేయడం చాలా మంచి అనుభవంగా ఫీల్ అవుతున్నా అంటూ తెలిపాడు. ఆడియన్స్ ఏమైతే పవన్ సినిమా నుండి ఆశిస్తారో అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.. ప్రేక్షకుల అంచనాలకు ఈ సినిమా ఖచ్చితంగా అనుగుణంగా ఉంటుందని తేజ్ తెలిపారు. నేను ఇప్పటి వరకు అయితే బ్రో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది, ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉండనుంది వంతులం అంశాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నా అన్నారు.

ఇక నా హెల్త్ బాగుండాలని స్వామిని కోరుకున్నాను.. 2014 లో ఇదే గుడికి నేను వచ్చాను.. అంతా మంచే జరిగింది అంటూ దేవునిపై నమ్మకాన్ని తెలియచేశాడు సాయి ధరమ్ తేజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version