విమానం టికెట్ బుక్ చేసారా…? అయితే మీకో గుడ్ న్యూస్..!

-

దేశం అంతా లాక్ డౌన్ కారణంగా వ్యవస్థలన్నీ ఎక్కడివక్కడే స్తంభించిపోయాయి. అడుగుబయట పెట్టే పరిస్థితి దేశంలో ఎక్కడా కనిపించలేదు. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రభుత్వాలు అన్ని రకాల రవాణా సర్వీసులు రద్దు చేశాయి. బస్ లు రైల్వే, విమాన సర్వీసులు అన్ని కూడా రద్దు చేశారు. ఇప్పటికే రైల్వే శాఖ రైళ్ళను నిలిపి వేసి ప్రీ బుకింగ్ టికెట్ లకు సంబంధించిన మొత్తాన్ని వారికి తిరిగి ఇచ్చివేస్తామని ప్రకటించడం తెలిసిందే. విమాన సర్వీసులు కూడా ఇప్పుడు అదే బాట పట్టాయి.

లాక్ డౌన్ సమయంలో విమాన టికెట్లు ప్రయాణాలు రద్దు అయిన వారికి టికెట్ల మీద ఫుల్ రీఫండ్ చేయాలని డీజీసీఏ ఆదేశించింది. విమానాలు రద్దు అవ్వడం వల్ల వారి టికెట్ల మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేట్ విమానయాన సంస్థలకు డిప్యూటీ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు తొలి విడుత, ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు రెండో విడుతగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసింది. అయితే టికెట్ల డబ్బులు రీఫండ్ చెల్లింపు విషయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి.

తాము చెల్లించిన మొత్తం రీఫండ్ చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేశారు. అయితే, టికెట్ల డబ్బులు తిరిగి చెల్లించే విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టికెట్ అమౌంట్ మొత్తాన్ని రీఫండ్ చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేశారు. కానీ ఆ మొత్తంలో సర్వీస్ చార్జీలు, లెవీ కింద కొన్ని కటింగ్స్ చేయాలని ఎయిర్‌లైన్స్ వారు నిర్ణయించారు. ఈ సమయంలో డీజీసీఏ విమానయన సంస్థలకు ప్రయాణికులకు టికెట్ రిఫండ్ చెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది. టికెట్లు రద్దు చేయమని కోరిన వారికి మూడు వారాల్లో వారికి ఫుల్ రీఫండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version