దేశ వ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో ప్రాంతీలు హవాను కనబరుస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో మొత్తం 6 స్థానాలకు ఉపఎన్నికలు జరగగా.. అన్ని చోట్లా ఆ పార్టీనే లీడ్లో కొనసాగుతోంది. నైహాతి, సితారి, తాల్దంగ్ర, హరోవా, మదరిహాత్, మెదినిపుర్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ దూకుడును కనబరుస్తోంది.
బెంగాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఎంసీ అభ్యర్థులు గెలుపొందడంపై ఇతర పార్టీలు నేతలు పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. మమతా బెనర్జీ అధికారాన్నిఅడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతోందని, ఓటర్లను బెదిరింపులకు గురిచేయడంతో పాటు బంగ్లాదేశ్ పౌరులకు ఓటర్ కార్డులు ఇచ్చి ఎన్నికల్లో లబ్ది పొందుతున్నారని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఆరోపిస్తున్నది.