HBD Allu Arjun: ఇప్పటివరకు అల్లు అర్జున్ సంపాదన ఎన్ని వందల కోట్లో తెలుసా..?

-

HBD Allu Arjun.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకుగా మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. రూ.3500 మొదటి పారితోషకంతో తన సంపాదన మొదలుపెట్టారు. ఇక తెలుగులోనే కాకుండా మలయాళం లో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తన డాన్స్ తో యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ఈయన ఈరోజు పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆస్తుల విలువ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కో సినిమాకు రూ.40 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్న ఈయన.. గత ఏడాది.. అల్లు అరవింద్ కొడుకులకు సమానంగా ఆస్తులు కూడా పంచేయడంతో ఇప్పుడు బన్నీ ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోయిందని సమాచారం. ఇక అల్లు అర్జున్ కొత్తగా కట్టుకున్న ఇంటి ఖరీదు రూ. 100 కోట్ల వరకు ఉంటుంది దాంతోపాటు బిజినెస్ లో కూడా బన్నీ ఆరితేరారు.. హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రముఖ పబ్ లలో అల్లు అర్జున్ ది కూడా ఒకటి ..ఇటీవల రెస్టారెంట్ రంగంలోకి కూడా అడుగు పెట్టాడు. ఇక ప్రత్యేకంగా రూ.7 కోట్లు పెట్టి క్యారవాన్ డిజైన్ చేయించుకున్నాడు.

ఇకపోతే ఇటీవలే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి రెండు దశాబ్దాల కాలాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక మొత్తంగా ఆయన దగ్గరున్న కార్ల విలువ, ప్రాపర్టీ విలువ, బిజినెస్ విలువ అలాగే యాడ్స్ ద్వారా వచ్చే డబ్బు అంతా కలిపి సుమారుగా రూ.400 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అలాగే తండ్రి నుంచి కూడా కొన్ని వందల కోట్ల ఆస్తి సంక్రమించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version