తెలంగాణకు చెందిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఈ మధ్యన కొన్ని అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ సమయంలో HCA కు అధ్యక్షుడిగా ఉన్నదీ ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్. హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్ స్టేడియం కు సంబంధించి సామాగ్రిని కొనుగోలు చేసే విషయంలో నిధుల గోల్ మాల్ జరిగిందని అజారుద్దీన్ పై కేసును నమోదు చేశారు. ఆ తర్వాత 41CRPC కింద నోటీసులు సైతం అజారుద్దీన్ కు ఇచ్చి విచారణ చేయాలని కోర్ట్ ఆదేశించింది. ఈ కేసులో అజారుద్దీన్ కు స్వల్ప ఊర్తల లభించింది, మల్కాజ్ గిరి కోర్ట్ ఈయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే ఇది కేవలం ఒక ఉపశమనం మాత్రమే అని కేసులో అసలు తప్పు జరిగి ఉంటే అజారుద్దీన్ ఏ విధంగా పాత్రుడయ్యాడు వంటి కీలక అంశాలను రుజువు చేయాల్సి ఉంది.
ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మహమ్మద్ అజారుద్దీన్ జూబిలీ హిల్స్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.