అప్పుచేసి మరీ ఆ షేర్లను కొన్నాడు..నెల రోజులకే రూ. 664 కోట్ల లాభం..!

-

అప్పు చేసి వ్యాపారం చేయకూడదని అంటారు.. నష్టపోతే మనం ఒక్కరిమే బాధపడొచ్చు.. అప్పు చేస్తే..ఆ డబ్బు కూడా కట్టాల్సి వస్తుంది. కానీ అదృష్టం, కృషి పట్టుదల ఉంటే..రిస్క్‌ చేయొచ్చు తప్పులేదని మేధావులు అంటారు. త్వరగా డబ్బు సంపాదించాలంటే..లాటరీ టికెట్‌ అయినా తగలాలి, స్టాక్‌ మార్కెట్‌లో అయినా ఎదగాలి. ఇక్కడొక కుర్రాడు అప్పు చేసి మరీ కొన్ని షేర్లను కొన్నాడు. సీన్‌ కట్‌ చేస్తే నెలరోజులకే కోట్లల్లో లాభం పొందాడు.. ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ.!

యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో చదువుతున్న జేక్ ఫ్రీమాన్ అనే 21 ఏళ్ల యువకుడు.. తన కుటుంబం, స్నేహితుల నుండి డబ్బు అప్పుగా తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. రూ.215 కోట్లు పెట్టుబడి పెట్టి..బెడ్ బాత్ అండ్ బియాండ్ కంపెనీలో షేర్లు కొనుగోలు చేశాడు. దాదాపు 50 లక్షల షేర్లను ఒక్కొక్కటి రూ.440 చొప్పున కొన్నాడు. అయితే నెల రోజుల వ్యవధిలోనే ఈ షేర్లు భారీగా పెరగడంతో అమ్మేశాడు. జేక్ ఈ షేర్లను విక్రయించినప్పుడు స్టాక్ విలువ రూ.2,160 స్థాయికి చేరుకుంది. షేర్ల అమ్మకంతో జేక్ ఒక నెలలో దాదాపు 878 కోట్ల రూపాయలు సంపాదించాడు. అంటే ఈ విద్యార్థి కేవలం నెల రోజుల్లోనే 664 కోట్ల రూపాయల లాభం పొందాడనమాట… తాను అసలు ఇంత భారీ లాభం ఊహించలేదు అని జేక్ ఫ్రీమాన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

అంత పెద్ద మొత్తం అప్పుచేశాడంటేనే…కుర్రాడికి ధైర్యం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. సబ్జెట్‌ మీద విపరీతమైన నాలెడ్జ్‌ ఉంటేనే ఇంత లోతుగా దిగాలి. వాళ్లు వీళ్లు చేశారు కదా అని మీరు ఏమాత్రం అవగాహన లేకుండా అస్సలు ఇలాంటి పనులు చేయొద్దు..ఎదురుదెబ్బ తగిలిదంటే..కోలుకోవడానికి జీవితం సరిపోదు.

ఈ స్టాక్ మార్కెట్‌లలో ప్రజలు డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ సబ్జెట్‌పై అవగాహన ఇవ్వడానికి ఎన్నో వెబ్‌సైట్లు ఉన్నాయి. నిపుణులు ఉన్నారు. మీకు ఆసక్తి ఉంటే..ముందు అన్నీ తెలుసుకుని స్టాట్‌ చేయొచ్చు. మార్కెట్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టి ఏ కంపెనీల స్టాక్ ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఏ కంపెనీలు తగ్గుతున్నాయనే వివరాలను తెలుసుకోవాలి. ఈ గ్లోబల్ స్టాక్ మార్కెట్లో చాలా మంది ఇన్వెస్టర్లు మిలియనీర్లు అవుతున్నారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version