ఆయన వ్యూహం పన్నితే ప్రత్యర్థులు గల్లంతు కావాల్సిందే. ఆయనకు ఏదైనా పని అప్పజెప్పితే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు మరో టాస్క్ అప్పజెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇంతకీ ఆయనెవరో గుర్తొచ్చిందా ఆయనేనండి ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు. ఇప్పుడు ప్రగతి భవన్ టాస్క్ లో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ మంత్రి.
మొన్నటి వరకు కాస్త దూరంగా ఉంచిన కేసీఆర్.. ఎప్పుడైతే ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారో అప్పటి నుంచి మళ్లీ దగ్గరకు తీసుకుంటున్నారు. ఈటల రాజేందర్ కూడా ప్రెస్‌మీట్లు పెట్టి హరీశ్‌రావుకే ప్రగతి భవన్‌లో ఎక్కువ అవమానాలు జరిగాయని బాంబు పేల్చడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు.
పార్టీలో వ్యతిరేకత రాకుండా ఉంచేందుకు హరీశ్‌రావుకు మళ్లీ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పటికే కొవిడ్ కంట్రల్ స్టాండింగ్ కమిటీకి హరీశ్‌రావును చైర్మన్‌ను చేసిన కేసీఆర్.. మొన్నగవర్నమెంట్ ఆస్పత్రుల మీద స్టడీ చేసే కేబినెట్ సబ్ కమిటీకి కూడా అధ్యక్షుడిని చేశారు.అలాగే హుజూరాబాద్ లో పార్టీని గట్టెక్కించే బాధ్యతను ఇచ్చారు. దీంతో ఒకేసారి ఇన్ని పనులు ఇవ్వడంతో హరీశ్‌రావు సతమతమవుతున్నారు. ఇవన్ని ఒకే టైమ్‌లో నెరవేర్చడం ట్రబుల్ షూటర్‌కు కత్తిమీద సాము అనే చెప్పాలి.