అరటి పండు చాలా తక్కువ ధర, విరివిరిగా దొరికే పండని చెప్పొచ్చు. ప్రపంచంలోనే ఎక్కువగా తినే పండు కూడా. అరటిపండులో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్‌గా పండ్లు తినడం వల్ల జబ్బులు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లను తరచుగా తినడం వల్ల కూడా అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అయితే కొంత మంది అరటి పండు తింటే బరువు పెరిగిపోతారని తినడం మానేస్తారు.
నిజానికి బరువు తగ్గాలనుకునేవారు అరటి పండు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటి పండులో ఎక్కువగా ఉండే పీచు పదార్ధం ఆకలి వేయకుండా చేస్తుంది. బరువును కంట్రోల్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే రోజుకో అరటి పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి..- ప్రతి రోజు అరటి పండు తినడం వల్ల తక్షణ శక్తి పొందవచ్చు. దీనిలో అధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.- అరటి పండ్లలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు దృడంగా ఉంచుతుంది. కిడ్నీ సమస్యలకు కూడా నివారిస్తుంది.- అరటిపండ్లలో పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో ఉపయోగపడుతుంది.- అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని నివారించడంలో బాగా సహాయపడుతుంది.- అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఇది ఫ్రీరాడికల్స్ ను నివారించడంతో పాటు, క్రోనిక్ డిసీజ్ ను నియంత్రిస్తుంది.
– అరటి పండ్లలో విటమిన్ సి తగిన మోతాదులో ఉంటుంది. నల్లటి వలయాలు, మొటిమలు, మచ్చలను తగ్గించడానికి అరటి బాగా సహాయపడుతుంది.
– అరటి పండ్లలో ఉండే విటమిన్ బి6 గర్భిణులకు మేలు చేస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.