రక్తపోటు నుండి మధుమేహం వరకు ఎన్నో సమస్యలను తరిమికొట్టే గోధుమ గడ్డి…!

-

గోధుమ గడ్డి చాలా విధాలుగా ఉపయోగ పడుతుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడే సహజసిద్ధమైన ఉత్పత్తుల్లో గోధుమ గడ్డి ఒకటి. దీనితో మనం అనేక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె, బి కాంప్లెక్స్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియం, సోడియం ఉంటాయి. పైగా దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు.

ఒక గ్లాసు రసం లోనే 17 ఎమినో యాసిడ్స్, ఫైబర్, ఎంజైమ్స్ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఈ పాటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఇక దీని వల్ల కలిగే బెనిఫిట్స్ చూద్దాం..!

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

నేటి కాలం లో రోగ నిరోధక శక్తి తగ్గి పోతోంది. గోధుమ గడ్డి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇది ఒంట్లో ఉండే వ్యర్థాలను బయటకు పంపించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

బరువు తగ్గిస్తుంది:

గోధుమ గడ్డి తీసుకోవడం వల్ల కొవ్వు శాతాన్ని కరిగించి, అధిక బరువును, పొట్టను తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ చిన్న పద్ధతిని అనుసరిస్తే ఎంతో మేలు జరుగుతుంది.

అధిక రక్తపోటును తగ్గిస్తుంది:

గోధుమ గడ్డి పొడిని తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ కలుగుతాయి. లేదంటే గోధుమ గడ్డి రసాన్ని కూడా తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా గోధుమ గడ్డి రసాన్ని లేదా పొడిని తీసుకుంటే రక్తపోటు రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్ ని కూడా ఇది తరిమికొడుతుంది.

మధుమేహం అదుపులో ఉంటుంది:

గోధుమ గడ్డి పొడిని లేదా గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.

శిరోజాల సంరక్షణకు గోధుమ గడ్డి :

శిరోజాల సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. పౌడర్ ని కానీ జ్యూస్ ని కానీ ఆహారంగా తీసుకుంటే జుట్టు రాలడం, తెల్లబడడం కూడా తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version