గత మూడు రోజులుగా నిర్మాత దిల్ రాజు అలాగే టాలీవుడ్ లోని సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు కూడా దిల్ రాజు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దిల్ రాజ్ తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే ఐటీ శాఖ అధికారులకు సంబంధించిన సంబంధించిన వెహికల్ లోనే దిల్ రాజు తల్లిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు ఫ్యామిలీ మెంబర్స్.
అయితే దిల్ రాజు తల్లి వెంబడి కుటుంబ సభ్యులతో పాటు ఐటీ శాఖకు చెందిన ఓ మహిళా అధికారి కూడా ఆసుపత్రికి వెళ్లారు. మిగిలిన అధికారులు ఇక్కడ ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు కాసేపటి క్రితమే ముగిసాయి. కానీ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో పై అలాగే ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన భారీ బడ్జెట్ నిర్మాతల ఇళ్లలో అలాగే పుష్ప టు నిర్మాత ఇళ్లలో సోదాలు ఇంకా సాగుతున్నాయి.