సికింద్రాబాద్ BRS ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన డెహ్రాడూన్ టూర్‌లో ఉన్నారు. అయితే అక్కడ ఆయనకు ఉన్నటుండి హార్ట్ ఎటాక్ రావడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రిలో ఎమ్మెల్యే పద్మారావు కు స్టంట్ వేసిన స్థానిక వైద్యులు.. ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. దాంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు కుటుంబ సభ్యులు.