ఇటీవల కురిసిన భారీ వర్షంతో నగరం మొత్తం తడిసి ముద్దయిన విషయం తెలిసిందే. అతి భారీ వర్షం కారణంగా నగరం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా జనావాసాలు కాదు నీటితో పెద్ద పెద్ద చెరువులను తలపించాయి అన్ని ప్రాంతాలు. వర్షం వర్షం తగ్గుముఖం పట్టి రోజులు గడిచినప్పటికీ ఇప్పటికి కూడా హైదరాబాద్ నగరం వరదల నుంచి తేరుకోలేదు. ఇలాంటి క్రమంలోనే మళ్లీ భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమై పోయాయి. మల్కాజ్‌గిరి, నాచారం, ముషీరాబాద్, కాప్రా, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చార్మినార్, సుల్తాన్ బజార్, కోఠి, ఖైరతాబాద్, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈ క్రమంలో మళ్లీ వరదలు ఎక్కడ ముంచెత్తుతాయో అని ప్రస్తుతం నగర వాసులు అందరూ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకును వెళ్లదీస్తున్నారు.