తెలంగాణకు మూడు రోజులు భారీ వర్ష సూచన..

-

తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా తెలంగాణలోకి ప్రవేశించినా.. రుతుపవనా విస్తరణ మాత్రం వేగంగా ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. తాజాగా.. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో నిన్న సాయంత్రం ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల్లో కుండపోత వాన కురుస్తుందని పేర్కొంది వాతావరణ శాఖ. వర్షాలు పడుతున్న సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వివరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. నిన్న కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి వాతావరణ శాఖ. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా అక్కెనపల్లి, పాత మంచిర్యాలలో 9.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలోని కారేపల్లిలో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది వాతావరణ శాఖ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version