ఆయనంటే చచ్చేంత ఇష్టం..అనుపమ పరమేశ్వరన్..!

-

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ సినిమాలు కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే తాజాగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల తర్వాత నిఖిల్ చేస్తున్న సినిమా కార్తికేయ టు.. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నార్త్ ఇండియన్ అమ్మాయిగా కనిపించబోతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించింది.

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ కార్తికేయ 2 సినిమాను చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమించి తెరకెక్కించింది. ముఖ్యంగా ఈ సినిమాలో నా పాత్రకు కార్తికేయ టు రిలీజ్ అయిన తర్వాత మంచి గుర్తింపు లభించే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నాను అంటూ ఆమె తెలిపారు. ఇకపోతే కార్తికేయ 2 సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని తెలిపిన అనుపమ పరమేశ్వరన్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో అంటే చచ్చేంత ఇష్టం అంటూ తన మనసులో మాట వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ . ఇక ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అని, ఎప్పటికైనా ఆయన సినిమాలలో నటించే అవకాశం వస్తే నా అదృష్టంగా భావిస్తాను అంటూ తెలిపింది.

ముఖ్యంగా చిరంజీవి సినిమాలను తాను ఎంతగానో ఇష్టపడతానని తెలిపిన అనుపమ చిరంజీవికి జోడిగా నటించే అవకాశం వస్తే వెంటనే ఓకే చెప్పేస్తానని కామెంట్స్ చేసింది. ఇకపోతే కార్తికేయ 2 సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నానని ఆమె తెలిపింది.ఇక అనుపమ పరమేశ్వరన్ కోరిక మేరకు చిరంజీవి గుర్తించి తన సినిమాలో ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది. ఇక అనుపమ నటించిన 18 పేజీస్ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version