భయం గుప్పిట్లో భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

-

హైదరాబాద్‌ను వరణుడు అతలాకుతలం చేస్తున్నాడు. భారీ వర్షాలు, ఉప్పొంగుతున్న వరదలతో నగర ప్రజలు సతమతమవుతున్నారు. కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఏ రోడ్డు మీద ఎక్కడ గుంత ఉందో.. ఏ మ్యాన్‌హోల్‌లో పడతామోనని భయపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలన్నా ఆలోచిస్తున్నారు.

నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరవ్యాప్తంగా రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడం వల్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర పనుల మీద బయటకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కాలనీలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి.

భారీ వర్షాలకు నగరంలో జంట జలాశయాలు, హుస్సేన్ సాగర్‌ నిండుకుండలా మారాయి. జీడిమెట్ల పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో చెరువు పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version