అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే కోస్తాజిల్లాలు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే మరో రెండు తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు భారీగా కురుస్తాయయని అధికారులు ప్రకటించారు. కాగా ఈ అల్పపీడనం నైరుతి దిశగా కదులుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు బాగా పడేందుకు అనువైన వాతావరణం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.
అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే కోస్తాజిల్లాలు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే చత్తీస్‌గడ్, విదర్భ ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఇక అల్పపీడం వల్ల రాయలసీమలో ఒక మోస్తారు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అయితే ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.