ముంబైని ముంచెత్తుతున్న వ‌ర్షాలు.. జ‌నం అష్ట‌కష్టాలు..ఫొటోలు..!

-

దేశ వాణిజ్య న‌గ‌రం ముంబైని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు ప‌డుతుండ‌డంతో జ‌న జీవ‌నం అస్త‌వ్యస్తంగా మారింది.

దేశ వాణిజ్య న‌గ‌రం ముంబైని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు ప‌డుతుండ‌డంతో జ‌న జీవ‌నం అస్త‌వ్యస్తంగా మారింది. ఇప్ప‌టికే అనేక చోట్ల వ‌ర‌దనీరు పెద్ద ఎత్తున చేర‌డంతో జ‌నాలు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. మ‌రోవైపు ఇవాళ ఉద‌యం కురిసిన వ‌ర్షానికి ముంబైలోని మ‌రిన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు చేరింది. ర‌హ‌దారుల‌పై వ‌ర‌ద‌నీటి తాకిడి ఎక్కువ కావ‌డంతో వాహ‌న‌దారుల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతోంది. అలాగే అనేక చోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాంలు ఏర్ప‌డుతున్నాయి. దీంతో వాహ‌న‌దారులు వ‌ర‌ద‌నీరు, ట్రాఫిక్‌లో గంట‌ల త‌ర‌బ‌డి రోడ్ల‌పై వేచి చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

అయితే మ‌రో మూడు రోజుల పాటు ముంబైలో మోస్తారు వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని ఇండియ‌న్ మెటెరొలాజిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఇప్ప‌టికే ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు వీలైనంత వ‌ర‌కు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉండే మంచిద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా ముంబైలో కురుస్తున్న‌వ‌ర్షాల వ‌ల్ల‌ లోక‌ల్ ట్రెయిన్ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతోంది. ప‌లు చోట్ల రైళ్ల‌ను క్యాన్సిల్ చేయ‌గా, కొన్ని చోట్ల వ‌ర‌ద‌నీరు ట్రాక్స్‌పై చేరినందు వ‌ల్ల రైళ్ల రాక‌పోక‌లు ఆల‌స్యం అవుతున్నాయి.

కాగా మాతుంగ ప్రాంతంలో ర‌హ‌దారిపై పెద్ద ఎత్తున వ‌ర‌ద‌నీరు చేరి చిన్న‌పాటి కుంట‌ను త‌ల‌పిస్తుంద‌ని ప‌లువురు యూజ‌ర్లు ట్విట్టర్‌లో వీడియోల‌ను పోస్ట్ చేశారు. అలాగే వాడాలాకు వెళ్లే దారిలోనూ ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. ఇక అంత‌టి భారీ వ‌ర్షం కురుస్తున్నా కొంద‌రు విద్యార్థులు వ‌ర్షంలోనే స్కూళ్లకు వెళ్ల‌డం కనిపించింది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ముంబై వాసులు వ‌ర్షం వ‌ల్ల ప‌డుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version