ఆంధ్రను వీడని వర్షాలు.. ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాన్!

-

ఫెంగల్ తుఫాన్ తీరం దాటి రెండ్రోజులు అవుతున్నా ఏపీని వర్షాలు వీడటం లేదు. తీరం దాటిన తుఫాన్ వాయుగుండంగా బలహీన పడుతుండగా.. ఒంగోలు, చిత్తూరు, గుంటూరు జిల్లాలతో పాటు ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఒంగోలులో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బస్టాండ్ కూడలి, కర్నూల్ రోడ్డులో భారీగా వర్షపు నీరు నిలిచింది.

ఇదిలాఉండగా, ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ స్పష్టంచేసింది. డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ మధ్య తమిళనాడును ఆనుకుని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే జరిగితే దాని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తా జిల్లాలపైనే ఉండే అవకాశం ఉంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పంట చేతికి వచ్చే సమయంలో ఈ వర్షాల వలన తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పంటలు దారుణంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version