ఏపీలో గాలివాన బీభత్సం.. పిడుగులు, మెరుపులు..

-

ఏపీలో గాలివాన బీభత్సం సృష్టించింది. గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఏపీ వ్యాప్తంగా వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా.. కొన్ని చోట్ల మెరుపులతో కూడిన వర్షం కురియగా.. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం ఎం కొత్తూరులో పిడుగుపాటుతో ఇద్దరు చనిపోయారు. జిల్లాలో మంగళవారం సాయంత్రం వర్షం పడగా.. ఇద్దరు మహిళలు పిడుగుపాటుతో మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీంతో పాటు.. కుప్పంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానతో దుమారం రేగడంతో.. కుప్పం-మల్లనూరు దగ్గర రోడ్డుపై చెట్టు విరిగి పడింది. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. అలాగే హైవే‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని చోట్ల భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version