తెలంగాణ, ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

-

గత రెండు రోజుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో ఎడతెరపు లేకుండా భారీ వర్షాలు పడ్డాయి. అయితే.. ఈ వర్ష ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు ఉండే ఛాన్స్ ఉన్నదని.. వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజుల పాటు, తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాక స్పష్టం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో భీభత్సంగా వర్షాలు పడుతాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version