Breaking : పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్‌ జాం

-

సంక్రాంతి పండుగకు వెళ్లిన జనం.. మళ్లీ పట్నం బాట పట్టారు. దీంతో రోడ్లపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ నెలకొంది. ఈ రద్దీని నియంత్రించేందుకు అధికారులు17 బ్లాక్ స్పాట్స్ ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నవాబు పేట నుంచి పెద్దకాపర్తి వరకు ప్రమాద ప్రాంతంగా గుర్తించారు. సెలవులకు, పండుగకు సొంతూళ్లకు వెళ్లి, తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటుండడంతో విజయవాడ హైవే బిజీగా మారింది. దీంతో గత 2,3 రోజుల నుంచీ బోసిపోయిన హైదరాబాద్ రోడ్లు.. మళ్లీ జనసంద్రంగా మారుతున్నాయి.

కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర కూడా వాహన రద్దీ భారీగా ఉండటంతో.. ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చాలా వరకూ వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నా కూడా రద్దీ ఎంత మాత్రం తగ్గలేదు. ఇవాళ మధ్యాహ్నం వరకూ సరిగ్గా ఇలాంటి రద్దీయే ఉండేలా తెలుస్తోంది.

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున స్పెషల్ బస్సులు నడుపుతున్నా.. రద్దీ తగ్గడం లేదు. కార్లు, బస్సులతో టోల్ ప్లాజాలు బారులు తీరి కనిపించాయి. నార్కట్ పల్లి- అద్దంకి హైవే లోని మాడుగుల టోల్ ప్లాజా దగ్గర కూడా సేమ్ సిట్యువేషన్. అటు వరంగల్- హైదరాబాద్ హైవై.. గూడూరు టోల్ ప్లాజా దగ్గర కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ కనిపించింది.

ఆదివారం ముందు పండగ వచ్చి ఉంటే.. ఆ వీక్ మొత్తం విలేజ్ లోనే హాలిడేస్ ఎంజాయ్ చేసే వెసలుబాటు ఉండేది. కానీ పెద్ద పండగ సండే రావడంతో.. అందరూ ఆ రోజే బయలు దేరి ఆఫీసులకు రావల్సి వచ్చింది. మిగిలిన కొందరు సోమవారం నాడు స్టార్ట్ కావడంతో.. రద్దీ ఈ రెండు రోజుల పాటు భారీ ఎత్తున కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ట్రైన్లలోనూ పెద్ద ఎత్తున రష్ కనిపించింది. జనరల్ కంపార్ట్ మెంట్లు అయితే పూర్తిగా నిండిపోయి కనిపించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version