కేసీఆర్‌ కీలక ఆదేశాలు..ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారి కోసం హెల్ప్‌లైన్‌ కేంద్రాలు

-

ఉక్రెయిన్‌ దేశంలో నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో.. కేసీఆర్‌ సర్కార్‌ అలెర్ట్‌ అయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణా విద్యార్థులకు తగు సహాయం అందించేందుకు న్యూ ఢిల్లీ తోపాటు తెలంగాణ సెక్రెటేరియట్ లలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఉక్రెయిన్‌ ఉన్న తెలంగాణ పౌరులందరినీ.. క్షేమంగా తీసుకువస్తామని ఆయన వివరించారు. వారి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.

ఇది ఇలా ఉండగా.. 15 మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్నారు. ఉక్రెయిన్ లో తాజా పరిణామాలతో ఆందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు. అవస్థలు పడుతు భయం భయంగా ఉన్నారు కరీంనగర్, జగిత్యాల జిల్లాకు చెందిన మెడిసిన్ విద్యార్థులు. విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నారు తల్లిదండ్రులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version