జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సూరన్ కీలక వ్యాఖ్యలు చేశారు సోమవారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తన అరెస్ట్ లో రాజ్ భవన్ పాత్ర ఉందని కేంద్రం పాత్ర ఉందని అన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడం దేశ చరిత్ర లో ఇదే మొదటిసారి అని అన్నారు తనకి అన్ని నిబంధనలు చట్టాలు తెలుసని చెప్పారు.
ఇప్పటికీ పరాజయాన్ని అంగీకరించబోనని ఆయన అన్నారు నన్ను జైల్లో బంధించి గెలవాలి అనుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అలానే ఈడి కి అసెంబ్లీ వేదికగా ఆయన సవాల్ విసిరారు తనకి వ్యతిరేకంగా ఏడి ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు అలానే మరోవైపు ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుంది ఈ నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల ఎమ్మెల్యేలు హైదరాబాద్ శివారులోని రిసార్ట్ నుంచి రాంచికి వెళ్లారు.