ప్రతి తండ్రి తన కొడుకుకు నేర్పించాల్సిన ఆరు విషయాలు ఇవే..!

-

చిన్నప్పుడు పిల్లలు తమ తండ్రిని హీరో అనుకుంటారు. పిల్లల పెంపకంలో తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ కొన్ని విషయాలను చిన్నప్పుడే పిల్లలకు చెప్పటంలో తండ్రికి ఎక్కువ బాధ్యత ఉండాలి. ముఖ్యంగా తమ కొడుకు విషయంలో ఆ తండ్రి కొన్ని విషయాలను చెప్పాలి. చిన్నపిల్లలు మట్టిముద్దలాంటి వారు..వారిని ఎలా మలుస్తామో దాదాపు అలానే ఎదుగుతారు. పెద్దయ్యాక కొన్ని కొన్ని మారుతాయి అంతే. కాబట్టి చిన్నవయసులోనే తండ్రి తమ కుమారుడికి కొన్ని విషయాలు నేర్పించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. గెలుపు ఓటములు

ప్రజెంట్ చాలామంది పేరెంట్స్ చేసే పెద్ద తప్పు..ప్రతివిషయంలో తమ పిల్లలు ముందుండాలి అనుకోని వారికి కూడా ఎలాగైనా గెలవాలి, ఫస్ట్ రావాలి ఇలా అన్నింటిలో ముందే ఉండాలి అని మైండ్ కి బాగా ఎక్కిస్తారు. ఓడిపోయినా తప్పులేదు..ఓడిపోతే నేర్చుకోవాలి, ఫెయిలే అయితే కష్టపడి పాస్ మార్కులు ఎలా తెచ్చుకోవాలి ఇలా సింపుల్ గా వాళ్లు ఓటమిలోనూ ఏం పోలేదు, అది కూడా మంచికే అనేట్లు చెప్పాలి. సాధించటం ఎంత ముఖ్యమో..ఓటమిని అంగీకరించటం కూడా అంతకంటే ముఖ్యం., లేదంటే మీరు ఇలా వాళ్లని గెలవాలి అంటూ బలవంతం చేస్తే వారు ఒకవేళ ఓడిపోతే దాన్ని తట్టుకోలేరు. చాలా ఆత్మహత్యలకు ఇదే కారణం..ఫెయిల్ అయి నామొఖం మా అమ్మానాన్నలకు ఎలా చూపించటం అని ఆత్యహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఈ విషయం చిన్నప్పటి నుంచే అర్థమయ్యేలా చెప్పాలి.

2. బాధ్యత

తండ్రి కుమారుడికి చెప్పాల్సిన ముఖ్యమైన విషయాల్లో బాధ్యత ఒకటి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా బాధ్యతగా ఉండటం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మీరే మీ కొడుకుకి ప్రాక్టికల్ గా అర్థమయ్యేలా వివరించాలి. బాధ్యత తీసుకోవటం అంటే చిన్నవిషయం కాదు..ఆ పని పూర్తియ్యే వరకూ అలానే వ్యవహించాలి, తప్పు చేస్తే ధైర్యంగా తప్పు అని ఒప్పుకునే సంస్కారాన్ని కూడా స్కూల్ డేస్ నుంచే నేర్చించటం చాలా ముఖ్యం.

3. కోపం..

బేసిక్ గానే అబ్బాయిలకు కోపం ఎక్కువ. అనవసరంగా పోట్లాడుకోవడం, దూకుడుగా ఉండటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇది చాలా తప్పుడు ఆలోచన అని మీరు మీ అబ్బాయికి స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది.. మితిమీరిన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని కోప్పడాల్సిన పరిస్థితుల్లో కోప తెచ్చుకోవచ్చు అంతేకానీ అనవసరమైన దానికి కోపం తెచ్చుకోవద్దని నేర్చించాల్సి ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకునే మంచి జ్ఞాన్నాన్ని మీరే అందిచాల్సి ఉంటుంది.

4. బయటకు చెప్పాలి…

మీ అబ్బాయి డల్ గా ఉన్నా, అలసిపోయినా, కోపంగా లేదా ఏదో తెలియని ఉత్సాహం ఇలా ఏది ఉన్నా సరే.. సంకోచం లేకుండా తన భావాలను పూర్తిగా వ్యక్తీకరించడాన్ని మీరే నేర్పించాలి. లేకుంటే ఏది బయటకు చెప్పకుండా తమలో తమే మదనపడుతుంటారు. ఇది అన్ని వేళలా మంచిదికాదు. అంతేకాదు, మగవాళ్లు ఏడ్వకూడదు అంటుంటారు. దాని వెనుక ఉన్న అర్థం ఒక తండ్రిగా మీరే చెప్పాలి. మీ అబ్బాయి కూడా ఏడవాలనుకుంటే, అందులో తప్పు లేదని అతనికి అర్థమయ్యేలా చెప్పాలి.

5. మర్యాద..

మన ఎంత బుద్దిమంతులైనా సరే..ఎదుటివ్యక్తితో మన ప్రవర్తనా విధానమే మన క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎటుటివ్యక్తిలో ఎలా మర్యాదగా నడుచుకోవాలో మీరే మీ పిల్లలకు చెప్పాలి. ఎవరినైనా కలిసినప్పుడు పలకరించటం, వాళ్లను గౌరవించటం, ఇతరులు అభిప్రాయాలను వినటం వంటివి మీరు నేర్పించాలి. అలాగే విన్నవన్నీ పాటించాల్సిన అవసరం లేదని కూడా చెప్పాలి. లేదంటే ఎవరేది చెప్పినా చేసే ఆటబొమ్మలా మారే అవకాశం కూడా ఉంది.

6. స్త్రీల పట్ల గౌరవం..

ప్రస్తుతం మనం చూస్తునే ఉన్నాం. చిన్నచిన్న అమ్మాయిలపైనే అత్యాచారాలు జరుగుతున్నాయి. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ అంటూ మహిళలపై గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మీ అబ్బాయికి చిన్నప్పటి నుంచే స్త్రీల మీద గౌరవం ఉండేలా చెప్పాలి. ప్రతీదీ చెప్తే వాళ్లకు అర్థంకాదు. మొదట మీరు స్ర్తీల పట్ల ఎంత గౌరవంగా ప్రవర్తిస్తున్నారో అలా మీ అబ్బాయి కూడా ఉంటాడనే విషయం గమనించండి. కాబట్టి ఈ విషయం వారికి తెలిసేలా మీరే ప్రవర్తించాల్సి ఉంటుంది.

ఈ ఆరువిషయాలను మీరే మీ పిల్లలకు ఎదిగే వయసులో చెప్పాల్సి ఉంటుంది. లేదంటే మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెత తీరు వస్తుంది. పెద్దయ్యాక మనం చెప్పినా వాళ్లు వినే స్థాయిలో ఉండరు అనే విషయం అందరికి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version