నాని హిట్ కోసం పుష్ప సినిమాను ఫాలో అవుతున్నాడా.!

-

నేచురల్ స్టార్ నాని అంటే మినిమం గ్యారెంటీ హీరో. తాను చేసిన ప్రతి సినిమా హిట్ లేదా ఏవరేజ్ గా ఆడేవి. ప్రస్తుతం తన పరిస్థితి అస్సలు బాగోలేదు. తన గత సినిమా అంటే సుందరానికి థియేటర్స్ లో విడుదల అయ్యి ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న దసరా అనే సినిమా నిర్మాణంలో ఉంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి నెలలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. 

ఈ సినిమా తో కచ్చితంగా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. తాను ఆశించినట్లు ఈమూవీ బిజినెస్ నాని కెరియర్ లోనే అత్యధికంగా జరిగిందనే ప్రచారం వుంది. ఇటీవలే మొదటి పాట ‘ధూమ్ ధామ్ దోస్తానా’  విడుదలైంది.  ఈ పాటకు రెస్పాన్స్ సూపర్ వస్తోంది దీనికి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. అలాగే ఈ సినిమా లో నటిస్తున్న హీరోయిన్ కీర్తీ సురేష్ లుక్ కూడా రిలీజ్ చేశారు.ఇది కూడా ప్రేక్షకులను ఆకర్షించింది.

ఇప్పుడు ఈ సినిమా పై సోషల్ మీడియాలో ఒక వర్గం అభిమానుల ఈ సినిమా పై అల్లు అర్జున్ నటించిన పుష్ప ఛాయలు కనపడుతున్నాయని ప్రచారం చేస్తున్నారు. అల్లు అర్జున్ లాగానే నాని గడ్డం తో చింపిరి జుట్టు పాత లుంగీ నలిగిన చొక్కాతో చాలా మాస్ గా వుండటం ను ఉదాహరణ గా చూపుతున్నారు.అలాగే కీర్తి సురేష్ ఫోటోను ‘పుష్ప’ మూవీలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రతో పోలుస్తున్నారు. ‘పుష్ప’ మూవీలో రష్మిక పెళ్లి కూతురుగా పసుపు రంగు చీరలో ఎలాగైతే వుందో అలాగే అచ్చు గుద్ది నట్లు వుందని ట్రోల్ చేస్తున్నారు. అసలే హిట్ కోసం చూస్తూంటే ఈ గోల ఏంటని నానితో పాటు సినిమా యూనిట్ మదన పడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version