టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో యంగ్ హీరో నితిన్ ఒకడు. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లు అవుతున్నా ఈ యంగ్ హీరో పెళ్లి ఊసే ఎత్తలేదు. అయితే ఇప్పుడు నితిన్ ఓ ఇండివాడు కాబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఫారెన్ లో ఎంబీఏ చదువుతున్న శాలిని అనే అమ్మాయితో నితిన్ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడని, వీరి ప్రేమకు పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇప్పటికే మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా నితిన్ ఈ వార్తలను నిజం చేస్తూ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ యంగ్ హీరో నిశ్చితార్థం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
పరిమిత సంఖ్యలో సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకని నిర్వహించారు. ఈ క్రమంలోనే హీరో నితిన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తన ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయని వెల్లడించారు. ‘మ్యూజిక్ స్టార్ట్స్… మీ ఆశీస్సులు కావాలి’ అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అంతేకాదు, తాను పెళ్లిచేసుకోబోయే అమ్మాయితో కలిసున్న ఫొటో, తమ పెళ్లిపనులకు నాందిగా పసుపు దంచుతున్న ఫొటోను కూడా పోస్టు చేశారు. ఇక ఎప్రిల్ 16 నితిన్ వివాహం జరుగనుందని సమాచారం. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలిసింది.