గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టాలీవుడ్ నటుడు శరత్ బాబు కాసేపటి క్రితమే కన్నుమూశారు. చాలా రోజులుగా మృత్యువుతో పోరాడిన శరత్ బాబు చివరికి దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. దీనితో సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా సినీ నటుడు శరత్ బాబు సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ , నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి హీరోలదే రాజ్యం. అటువంటి తరంలో ప్రవేశించిన శరత్ బాబు అందరితోనూ సినిమాలు చేసి వారితో అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక ఇప్పటి తరం హీరోలుగా వెలుగుతున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి హీరోలతో సైతం నటించి అనేక చిత్రాలలో కనిపించారు.