రజనీకాంత్ కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హీరో సిద్దార్థ్..?

-

హీరో సిద్దార్థ్ ను దాదాపు టాలీవుడ్ మరిచిపోయింది. కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు సిద్దార్థ. ఆ త‌ర్వాత ఈయ‌న‌కు క్రేజ్ త‌గ్గుతూ వ‌చ్చింది. ఇక ఈమధ్య అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ అవేవీ తెలుగు తెరపై వర్కవుట్ కాలేదు. హీరో సిధార్థ తెలుగులో కనిపించిన చివరి సినిమా ‘గృహం’. ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్ర‌స్తుతం సిద్ధూ పూర్తిగా తమిళ పరిశ్రమకే ప‌రిమితం అయ్యాడు. ఇక‌ సిద్దార్థ్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించేందుకు సిద్దం అయ్యాడు.

ఈ నేప‌థ్యంలోనే ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ చేస్తున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. అయితే ఇదే జోరు మీద‌.. సిద్దార్థ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ద‌ర్బార్ సినిమా త‌ర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని శివ డైరెక్షన్లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ చిత్రం ఒక షెడ్యూల్ కూడా ముగిసింది.

అయితే ఇందులో ఒక కీల‌క‌మైన‌ పాత్ర కోసం హీరో సిద్దార్థ్ ఎంపికయ్యారని, త్వరలో మొదలుకానున్న రెండో షెడ్యూల్లో ఆయన జాయిన్ అవుతారని తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇన్నేళ్ల కెరీర్లో సిద్దార్థ్ రజనీతో కలిసి వర్క్ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. అలాగే ఆ త‌ర్వాత ఈయ‌న‌కు ఛాన్సులు కూడా పెరిగే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version